Yearly Archives: 2021

డిగ్రీ, పీ.జీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎంకాం, ఎం.ఎస్‌సి, ఎం.బి.ఏ.) ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్‌గా చదువుకోలేక పోతున్న గృహిణులు, ఉద్యోగులు, మధ్యలోనే చదువు ఆపేసిన …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు, ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల …

Read More »

ప్రాజెక్టు నివేదిక, రూపకల్పనపై కార్యశాల

డిచ్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగంలో ప్రాజెక్ట్‌ నివేదిక రూప కల్పనపై అంతర్జాల కార్యశాల నిర్వహించారు. కార్యక్రమంలో మొదటగా వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డా. రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్ట్‌ కోసం నిత్య జీవితంలో సమాజానికి ఉపయోగపడే అంశాన్ని ప్రాజెక్ట్‌గా ఎంచుకోవాలని, ఎంచుకునే సమయంలో పరిగణలోకి అంశాలను సూచించారు. అనంతరం వాణిజ్య శాస్త్ర విభాగం డీన్‌, ప్రొఫెసర్‌. …

Read More »

నేటి పద్యం

అవని యెడద పైన హరిత హారపు వెల్గు పచ్చల సరణిగను వఱలు వేళ పసిడి కాంతుల ధర మిసిమివన్నెలు జూచి వరుణుడొసగె జినుకు వజ్రములను తిరునగరి గిరిజా గాయత్రి

Read More »

20 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు…

హైదరాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా వాయిదా పడిన మూడు, నాలుగు (చివరి) విడతల జేఈఈ మెయిన్‌ పరీక్షల కొత్త తేదీలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడిరచింది. రెండు విడతల పరీక్షలూ ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన మూడో విడత పరీక్షలను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు, మే నెలలో నిర్వహించాల్సిన చివరి విడత పరీక్షలను …

Read More »

వంట కార్మికుల నియామకానికి అనుమతి..

హైదరాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు అందించడం కోసం 2021-22 విద్యా సంవత్సరానికి 54 వేల 201 మంది వంట కార్మికులను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. వారిని పొరుగు సేవల విధానంలో నియమించుకోవాలంటూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనంతో 10 నెలల పాటు వారిని విధుల్లోకి తీసుకోవచ్చు. ప్రత్యక్ష తరగతులు జరిగితేనే …

Read More »

47వ వార్డులో హరితహారం

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతి హరితహరం స్పెషల్‌ డ్వ్రెవ్‌లో భాగంగా బుధవారం 47 వార్డులోని పట్టణ పోలిస్‌ స్టేషన్‌, రూరల్‌ పోలిస్‌ స్టేషన్‌, ఓరియంటల్‌ స్కూల్‌ ఆవరణలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ ఛైర్మన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి, 47వ వార్డ్‌ కౌన్సిలర్‌ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. మన పరిసర …

Read More »

పాలెం చెక్‌ డ్యాంను సందర్శించిన మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

మోర్తాడ్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలంలోని పాలెం గ్రామంలోని చెక్‌ డ్యామ్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ మంత్రులు చెయ్యలేని పని మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేశారని, తెలంగాణలో ముఖ్యంగా రైతులు వారి సొంతంగా 24 వేల 50 లక్షల ఎకరాల సాగు భూమికి సొంతంగా బోర్లు వేసుకుని ఉన్నారని, కానీ …

Read More »

12న వేలం పాట

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలో ఏ.ఆర్‌. స్టోర్‌లో, పోలీసు కార్యాలయంలోని వినియోగం అనంతరం వాటిని ప్రస్తుతం వాటి కాల సమయం పూర్తయిన సామాగ్రిని వేలం వేయనున్నట్టు నిజామాబాద్‌ కమీషనర్‌ ఆఫ్‌ పోలీసు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో వేలం పాట వేయడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తిగల వారు …

Read More »

నీరుగొండ హనుమాన్‌ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం స్థానిక నీరు గొండ హనుమాన్‌ దేవాలయంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శత కలశ సహిత మహా కుంభాభి షేకం ప్రారంభం అవుతున్న సందర్భంగా నీరు గొండ హనుమాన్‌ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. నీరు గొండ హనుమాన్‌ ఆలయానికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »