కామారెడ్డి, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుధవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వ్యాక్సినేషన్ 100 శాతం అయ్యే విధంగా చూడాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వచ్చే అవకాశం ఉన్నందున …
Read More »Yearly Archives: 2021
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్సులో సహకార, సివిల్ సప్లై అధికారులతో మాట్లాడారు. ఐదు రోజుల్లో దాన్యం కొనుగోలు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించే విధంగా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం …
Read More »ఉద్యోగులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త జోనల్ విధానాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం సెలవులో, డిప్యుటేషన్‌లో, సస్పెన్షన్‌లో లేదా ఫారిన్ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు గురువారం సాయంత్రం కల్లా తమ ఆప్షన్లను జిల్లా అధికారులకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »పరీక్షా కేంద్రాల తనిఖీ
డిచ్‌పల్లి, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఆర్మూర్‌లో డిగ్రీ 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్ష కేంద్రాలు అయిన గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, నరేంద్ర డిగ్రీ కళాశాలలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విసి వెంట పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య యమ్ అరుణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయగౌడ్ ఉన్నారు.
Read More »కేర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు
నిజామాబాద్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంక్ వారు ప్రాంగణ నియామాకాలు ఈనెల 10న శుక్రవారం ఉదయం 10 గంటల నుండి చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై 25 సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు ప్రాంగణ నియామకాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువతి యువకులకు ఇది మంచి …
Read More »అర్హులకే రెండు పడక గదుల ఇళ్ళు
వేల్పూర్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం గృహ నిర్మాణ శాఖ వేల్పూర్ మండల కేంద్రంలో నిర్మించిన 112 డబల్ బెడ్ రూమ్స్ ఇళ్లను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ …
Read More »తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు
కామారెడ్డి, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ ఓ నెగెటివ్ రక్తనిల్వలు లేకపోవడంతో లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే …
Read More »యాసంగి వరి పంటను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగిలో వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని వడ్ల కొనుగోళ్ల పేరుతో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్ల యాజమాన్యాలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏ.ఐ.కె.ఎమ్.ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతూ …
Read More »కోవిడ్ టీకా కేంద్రాల తనిఖీ
కామారెడ్డి, డిసెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోవిడ్ 19 టీకా కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి.చంద్రశేఖర్ తనిఖీలు చేశారు. జిల్లాలో 100 శాతం వాక్సినేషన్ చేయాలని తమ లక్ష్యం అది పూర్తయ్యేవరకు ప్రతి రోజు వ్యాక్సినేషన్ సెషన్స్ కొనసాగుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ అదేశానుసరం ఐసీడీఎస్, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సహకారంతో ప్రత్యేక …
Read More »లోక్‌సభలో వినూత్నంగా తెరాస ఎంపీల ఆందోళన
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు నల్ల దుస్తులతో హాజరయ్యారు. రాజ్యసభ, లోక్‌సభలలో ఎంపీల నిరసన కొనసాగుతుంది. కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ లోక్ సభలో తెరాస పార్టీ సహచర ఎంపీలతో కలిసి నల్ల దుస్తులతో హాజరై ఆందోళన చేపట్టారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని …
Read More »