Yearly Archives: 2021

ఎడపల్లిలో పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం

బోధన్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళాబృందం వారి ఆధ్వర్యంలో ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనీ ఎడపల్లి ఓల్డ్‌ బస్టాండ్‌ వద్ద గ్రామప్రజలకు వివిధ రకాల అంశాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించి, గ్రామంలోని యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలు కాకుండా మంచి …

Read More »

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రత్యామ్నాయ పంటల గోడ పతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాసంగిలో వరికి బదులుగా శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో …

Read More »

అటవీ భూములు ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అటవీ అధికారులను అడ్డగించిన వారిపై దాడి చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రెవిన్యూ, అటవీ, పోలీస్‌ …

Read More »

సెల్‌ టవర్‌ నిర్మాణం ఆపేయాలని ధర్నా

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూరు రాంనగర్‌లో సెల్‌ టవర్‌ నిర్మాణం ఆపాలని సెల్‌ టవర్‌కి పర్మిషన్‌ ఇవ్వద్దని గురువారం ఆర్మూర్‌ పట్టణంలోని రామ్‌ నగర్‌ ప్రజలు నిజామాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయం చేరుకొని ధర్నా చేసి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఆర్మూర్‌ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రజల నివాసాల మధ్య సెల్‌టవర్‌ నిర్మించడం సరైంది కాదని …

Read More »

కోవిడ్‌ ఎక్స్‌గ్రేషియా కొరకు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా చెల్లించుటకు కుటుంబ సభ్యులు సంబంధిత వైద్య ధ్రువపత్రంతో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కోవిడు బారిన …

Read More »

వ్యాక్సినేషన్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని 15 రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణాల్లో రేషన్‌ షాపుల వద్దకు ఉదయం పూట ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి వ్యాక్సినేషన్‌ తీసుకొని వారిని డీలర్ల …

Read More »

బి.ఇ.డి కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యునివర్సిటీ పరిధిలోని బి.ఇ.డి. కళాశాలల అక్రమ అఫియషన్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం యూనివర్సిటీలో వైస్‌ చాన్సలర్‌ చాంబర్‌ వద్ద డిమాండ్‌ చేశారు. విద్యార్థి నాయకులు నినాదాలు చేస్తు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యునివర్సిటి పరిధిలోని బి.ఇ.డి. కళాశాలలలో కనీస వసతులు లేవని, అధ్యాపకులు కూడా లేరని అదే విధంగా …

Read More »

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డెవలప్‌మెంట్‌ ఫీజు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో విద్యార్థుల వద్ద డెవలప్‌మెంట్‌ ఫీజుల వసూలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీరామ్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్‌ కల్పన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా …

Read More »

పదోన్నతులు కల్పించండి…

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్‌, తెలంగాణ యూనివర్సిటీలో 2014 లో నియమితులైన రెగ్యులర్‌ అధ్యాపకులు వారికి పదోన్నతులు కల్పించక పోవడంపట్ల గురువారం ధర్నా నిర్వహించారు. 2014 లో నియమితులైన అధ్యాపకుల అధ్యక్షుడు డా. బాలకిషన్‌, కార్యదర్శి డా. లక్ష్మణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ తమకు వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించాలని లేనిచో నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలంగాణ విశ్వవిద్యాలయ …

Read More »

పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీపీ

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలంలోని స్కూల్‌ తాండ జడ్‌.పి.హెచ్‌.ఎస్‌ పాఠశాలను ఎంపీపీ నా రెడ్డి దశరథ రెడ్డి పరిశీలించారు. విద్యా విషయంలో కనీస మౌలిక వసతులు విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారం అందడం లేదని తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పైన ఆగ్రహం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »