Yearly Archives: 2021

బోరు మోటారు ప్రారంభించిన ఎంపిపి

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం స్కూల్‌ తాండ గ్రామంలో, జగదాంబ తండా గ్రామాలలో బోరు మోటర్‌ను ఎంపీపీ దశరథ రెడ్డి ప్రారంభించారు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్నదని ఇరు గ్రామాల ప్రజల ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు స్థానిక ఎంపిటిసి సంత్యఅలి చంద్రునాయక్‌, ఎంపిపి దశరథ రెడ్డి నిధుల నుండి రెండు గ్రామాల దాహర్తిని తీర్చాలని బోర్‌ మోటార్‌ వేస్తున్నామని తెలిపారు. నీటి …

Read More »

ఏ పంటలు వేస్తే రైతుకు మంచిదో వివరించండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో వడ్లను కొనే అవకాశం లేనందున వరికి బదులు రైతులు పంట మార్పిడి ద్వారా ఏ పంటలు సాగు చేయాలో వివరించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, కె.వి.కె. శాస్త్రజ్ఞులు, రైస్‌ మిల్లర్లు, రైతుబంధు ప్రతినిధులు, విత్తన డీలర్లతో సమావేశం …

Read More »

వ్యాక్సిన్‌ తీసుకోకుంటే థర్డ్‌ వేవ్‌ ప్రమాదం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ చివరి నాటికి తప్పనిసరి రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు ప్రజలను కోరారు. గురువారం కరోనా వ్యాక్సినేషన్‌ పై కలెక్టర్‌ జడ్పీ చైర్మన్‌తో కలిసి మండలాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ …

Read More »

అత్యవసర సమయంలో రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర పరిస్థితిలో కామారెడ్డిలోని ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గాంధారి మండలానికి చెందిన మహిళకి చికిత్స నిమిత్తం బి.నెగెటివ్‌ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్‌, కొత్మీర్‌ కార్‌ రామకృష్ణ లను సంప్రదించారు. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన వడ్ల సురేష్‌ సహకారంతో అత్యల్పంగా లభించే బి. నెగెటివ్‌ …

Read More »

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను, తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఓటర్‌ నమోదు కార్యక్రమం గరుడ యాప్‌ వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా శశాంక్‌ గోయల్‌ …

Read More »

అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా రెవిన్యూ, అటవీ, పోలీస్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో అటవీ, రెవెన్యూ, పోలీస్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో అర్హత గల లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. …

Read More »

ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్‌ను అరికట్టడంలో ప్రతి ఒక్కరు …

Read More »

వందశాతం రెండు విడతల వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ చివరికల్లా రాష్ట్రంలో రెండు విడుదల వ్యాక్సినేషన్‌ నూరు శాతం పూర్తి చేయడంతోపాటు ఓమైక్రాన్‌ గురించి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖామాత్యులు టి హరీష్‌ రావు కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్‌, ప్రపంచవ్యాప్తంగా …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఇంటర్‌ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (డిఐఇవో) కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్‌ కల్పన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం …

Read More »

వసతి గృహాన్ని తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ మెయిన్‌ క్యాంపస్‌ బాలికల వసతి గృహంను బుధవారం తెలంగాణ విశ్వవిద్యాలయ చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖవి తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థినులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. థర్డ్‌ వేర్‌ కరోనా వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ముఖానికి మాస్కు మరియు శానిటైజర్‌ దగ్గర ఉంచుకోవాలని, మీ రూమ్‌లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »