Yearly Archives: 2021

గుండెపోటు రోగికి వైద్యం చేస్తూ వైద్యునికి గుండెపోటు

గాంధారి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుండెపోటుతో వచ్చిన రోగికి వైద్యం చేస్తున్న డాక్టర్‌కు గుండెపోటు వచ్చిన సంఘటన ఆదివారం గాంధారి మండలంలో చోటుచేసుకుంది. అయితే ఇందులో రోగితో పాటు డాక్టర్‌ కూడా గుండెపోటుతో మృతి చెందడంతో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.గాంధారి మండలం గుజ్జుల్‌ తండాకు చెందిన బజ్యా నాయక్‌ (48) కు ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన మండల కేంద్రంలోని …

Read More »

రిజిస్ట్రేషన్‌ రుసుము తిరిగి చెల్లిస్తున్నాము…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ధరణి టౌన్‌ షిప్‌ రిజిస్టేషన్‌ రుసుము రూ.3000 దరఖాస్తుదారునికి తిరిగి చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి మండలం అడ్లూరు శివారులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందించే ధరణి టౌన్‌ షిప్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 580 అర్జీదారులు ఈ సేవ కేంద్రంలో గతంలో …

Read More »

ఘనంగా కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇస్సన్నపల్లి గ్రామంలో వెలిసిన కాల భైరవ స్వామి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపి బిబి పాటిల్‌, ఎమ్మెల్యే సురేందర్‌ స్వామి వారి సేవలో రథ శోభయాత్ర నిర్వహించారు. అగ్ని గుండాలలో పాల్గొన్న భక్తుల అగ్నిప్రవేశాన్ని తిలకించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపి బిబి పాటిల్‌, ఎమ్మెల్యే సురేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం …

Read More »

జ్యోతిభాపూలే ఆశయాలకు అనుగుణంగా ఉద్యమిస్తాం

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాహాత్మాజ్యోతిభాఫూలే ఆశయాలకు అనుగుణంగా సమాజం కోసం ఉద్యమిస్తామని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు గడ్డం సంపత్‌ అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిభాఫూలే 131వ వర్దంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట గల జ్యోతిభాఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన భారతదేశంలో ఉన్న తీవ్రమైన మూడవిశ్వాసాలు, సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించారని గుర్తు …

Read More »

యాసంగిలో వరి సాగు వద్దు

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే యాసంగి సీజన్‌లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక వంటి అంశాలపై శనివారం అన్ని జిల్లా కలెక్టర్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వివరాలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు దాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. బాన్సువాడలో …

Read More »

ఐటిఐలో ప్రవేశాలకు మరో అవకాశం

నిజామాబాద్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ, ప్రయివేటు ఐటిఐ విద్యార్థుల అడ్మిషన్‌ కొరకు 4వ ఫేస్‌కు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించడానికి ఈనెల 30 వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్‌, జిల్లా కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న వారికి, కొత్తగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మెరిట్‌ …

Read More »

లింబాద్రి గుట్టకి పోటెత్తిన భక్తులు

భీమ్‌గల్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతర మహోత్సవం కార్తీక పౌర్ణమి ముగించుకుని తరువాత వచ్చిన శనివారం 4వ శనివారం సెలవు దినం కావడంతో లింబాద్రి గుట్ట కి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నృసింహుని దర్శనం కోసం ఉదయం నుండే బారికెట్ల మధ్యలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం వారు ఏర్పరచిన అన్నదాన కార్యక్రమంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి …

Read More »

సిసి కెమెరాలతో అనేక విషయాలు రికార్డు అవుతాయి…

వేల్పూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం లక్కొర గ్రామంలో ఎస్‌ఐ భరత్‌ రెడ్డి సీసీ కెమెరాల పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరగవని, గ్రామంలో జరుగుతున్న దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు రికార్డ్‌ అయి ఉంటాయని, సిసి కెమెరాల వల్ల కలిగే లాభాలను గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

వరి ధాన్యం పరిశీలించిన బిజెపి నాయకులు

వేల్పూర్‌, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలంలోని పడగల గ్రామంలో వరి ధాన్యాన్ని బాల్కొండ బిజెపి పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్‌ రాజేశ్వర్‌తో, మండల స్థాయి నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్బంగా రాజేశ్వర్‌ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమని హుజురాబాద్‌ ఎన్నికల్లో తెలంగాణ పార్టీ ఎమ్మెల్యే ఓడిపోవడం పట్ల సీఎం కెసిఆర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »