Yearly Archives: 2021

డయాలసిస్‌ హబ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో డయాలసిస్‌ హబ్‌ ఏర్పాటుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. స్థలం అనుకూలంగా ఉందని రెవెన్యూ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్యాధికారి కల్పన కంటే, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read More »

కలెక్టర్‌ను కలసిన తెయు ఉపకులపతి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ నిజామాబాద్‌ జిల్లా కలక్టర్‌ సి. నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి సహకరించాలని తెయూ ఉపకులపతి ఆచార్య డి రవీందర్‌ గుప్తా నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ని సన్మానించారు.

Read More »

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల

ఆర్మూర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న నరేంద్ర డిగ్రీ కళాశాల యుజిసి నియామకాలను పాటించకుండా విద్యార్థుల దగ్గరనుండి విచ్చలవిడిగా ఫీజు వసూలు చేయడం జరుగుతుందని గతంలో కూడా విద్యార్థుల సర్టిఫికెట్‌లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం జరిగిందని ఏబివిపి నాయకులు వినయ్‌ అన్నారు. ఈ మేరకు సోమవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో …

Read More »

ఇన్‌చార్జి అధికారిగా దయానంద్‌

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఇంచార్జ్‌ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిగా టి.దయానంద్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇంతవరకు ఇన్‌చార్జి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా ఉన్న శబ్న హైదరాబాద్‌ ఉపాధి కల్పన కార్యాలయానికి డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్బంగా ఇంచార్జి మైనార్టీ సంక్షేమ అధికారి …

Read More »

బాలలను అభివృద్ధి పథంలో ఎదగనీయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల బాలికలను అభివ ృద్ధి పథంలో ఎదగనీయాలనీ జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ బాలలతో స్నేహ పూరిత వారోత్సవాలలో భాగముగా మహిళ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, రోజ్‌ చైల్డ్‌ లైన్‌ 1098 కామారెడ్డి ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో బాలల హక్కుల …

Read More »

వ్యవసాయ చట్టాల రద్దు రైతాంగ పోరాట విజయం

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ (ఏఐకెఎస్‌సిసి) ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లీలో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు స్వీట్లు పంచి, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఏఐకెఎస్‌సిసి జిల్లా బాధ్యులు వి. ప్రభాకర్‌ మాట్లాడుతూ చలిని, …

Read More »

రేపే లక్కీ డ్రా…

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 2021-23 (ఏ 4) మద్యం దుకాణాల లైసెన్సుల దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగిసింది. మొత్తం 102 దుకాణాలకు 1672 దరఖాస్తులు వచ్చాయి. నూతన లైసెన్స్‌ మంజూరు కొరకు శనివారం 20వ తేదీ జరగబోయే లక్కీ డ్రా నిర్వహించే వేదిక నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి శుక్రవారం …

Read More »

అంబులెన్స్‌లో ప్రసవం… తల్లి, బిడ్డ క్షేమం

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామానికి చెందిన భారతికి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు రాత్రి వేళ ఫోను చేయగా అంబులెన్స్‌ సిబ్బంది అక్కడికి సకాలంలో చేరుకొని దొమ్మట భారతి (25)ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో నొప్పులు అధికం కావడంతో కామారెడ్డికి సమీపంలో బైపాస్‌ రోడ్డు వద్ద ఆమెకు అంబులెన్స్‌లోనే సుఖప్రసవం చేశారు. బిడ్డ మెడ చుట్టూ బొడ్డు …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి వేడుకలు..

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలోగల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో రaాన్సీ లక్ష్మీబాయి, గురు నానక్‌ దేవ్‌ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి మహనీయుల యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. …

Read More »

మున్సిపల్‌ కార్మికులను విస్మరించడం సిగ్గుచేటు

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచిన తర్వాతే పాలక వర్గాలకు వేతనాలు పెంచాలని ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కోటగల్లి శ్రామిక భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌, డిప్యూటీ మేయర్‌లకు, కార్పొరేటర్లకు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌లకు 30 శాతం వేతనాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »