Yearly Archives: 2021

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు వచ్చి కుప్పలు పోసిన ధాన్యం నుంచి తేమ శాతాన్ని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్‌, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 10న జరిగే ఎం.ఎల్‌.సి ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుండి ఎం.ఎల్‌.సి ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఈఓ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా 9 ఉమ్మడి జిల్లాలలో 12 సీట్లకు జరిగే స్థానిక సంస్థల …

Read More »

సోషల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కళాశాలను సందర్శించిన వైస్‌ఛాన్స్‌లర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల అయిన ఎస్సి సోషల్‌ వెల్ఫేర్‌ (బాలికల) డిగ్రీ కళాశాల దాస్‌ నగర్‌ నిజామాబాద్‌, తెలంగాణ విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ బుధవారం సందర్శించారు. అక్కడి పరిసరాల గురించి ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని అక్కడి ఉద్యోగులను ఆదేశించారు.

Read More »

బాలల హక్కులపై అవగాహన

వేల్పూర్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం జాన్కంపేట్‌ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బాలలకు హక్కులపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఐ.సి.డి.ఎస్‌. అధికారి చైతన్య, సిడిపిఓ సుధారాణి, అధికారి వేల్పూర్‌ సూపర్‌వైజర్‌ నీరజ ఈ సందర్భంగా మాట్లాడారు. విద్యార్థులకు బాలల హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. బాల్యవివాహాలు, లింగ నిర్ధారణ చట్టం, గుడ్‌ …

Read More »

ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పనిసరిగా పాటించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు, పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ప్రవర్తనా నియమావళి తప్పకుండా పాటించాలని, అదేవిధంగా కోవిడ్‌ నిబంధనలు కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి పొందాలని, ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నారాయణ …

Read More »

పిడిఎస్‌యు రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ను జయప్రదం చేయండి

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్‌.యు) రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు, జనరల్‌ కౌన్సిల్‌ను జయప్రదం చేయాలని పిడిఎస్‌యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్‌, కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా అధ్యక్షురాలు కల్పన, జిల్లా ప్రధాన …

Read More »

నెహ్రూయువకేంద్రలో సాంస్కృతిక పోటీలు

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అజాది కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, నిజామాబాద్‌ ఆధ్వర్యంలో వ్యాస రచన, ఉపన్యాస, దేశభక్తి గీతాల, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవాల సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న పోటీలలో యువత విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానించారు. పోటీలలో గెలుపొందిన …

Read More »

ఖానాపూర్‌లో గంజాయి స్వాధీనం

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రాత్రి 8 గంటలకు నిజామాబాద్‌ జిల్లా నిజామాబాద్‌ రూరల్‌ మండలం ఖానాపూర్‌ గ్రామంలో గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ నిజామాబాద్‌ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నందగోపాల్‌ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ శాఖ వారు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గంజాయి చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముతున్న గంట మల్లేష్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసి …

Read More »

బోధనేతర సిబ్బంది సేవ‌లు మరువలేనివి

డిచ్‌పల్లి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్‌ భవనంలో బోధనేతర సిబ్బందితో ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ గుప్త సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధనేతర సిబ్బంది సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మన విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఉంటుందని, ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంకా ఎక్కువ సహాయం ఉంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఉన్నత విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దవచ్చన్నారు. అందరూ ఇప్పటి లాగే ఎప్పటికి …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే

కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు (28) కి ఆపరేషన్‌ నిమిత్తమై హైదరాబాదులో గల నిజాం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) లో ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మేడ్చల్‌లో తెలంగాణ విద్యుత్‌ సంస్థలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న దుంప పోషరాములు సహకారంతో ఓ పాజిటివ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »