గాంధారి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం తాను దత్తత తీసుకున్న గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మార్చ్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల ఆవరణలో క్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడా మైదానంలో …
Read More »Yearly Archives: 2021
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఇందిరాగాంధీ, స్వర్గీయ రాజీవ్ గాంధీ పార్టీని ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ, దేశ ప్రజలకు …
Read More »కామారెడ్డికి కొత్త ఎస్‌పి
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను సోమవారం కొత్త ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు మొక్కను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఉన్నారు.
Read More »అర్జున్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో దొండి అర్జున్ పరిశోధన చేసిన జానపద సాహిత్యంలో స్త్రీ పాత్ర చిత్రణ సమగ్ర పరిశీలన అనే అంశంపై సోమవారం మౌఖిక పరీక్ష నిర్వహించారు. హుమానిటీస్ సెమినార్ హాల్‌లో జరిగిన పరీక్షకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఆచార్యులు డాక్టర్ గోనానాయక్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. దొండి అర్జున్ …
Read More »బిజెపి నాయకుల అరెస్టు
ఆర్మూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన నిరుద్యోగ దీక్ష విజయవంతం చేయడానికై వెళ్ళే పార్టీ కార్యకర్తలను అర్ధరాత్రివేళ అరెస్టు చేసి పోలీసు కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, …
Read More »తెలంగాణ యూనివర్సిటీ హాకీ జట్టు విజయం
డిచ్‌పల్లి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహిస్తున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ మెన్ చాంపియన్ షిప్ 202122 బెంగుళూరు యూనివర్సిటీ, బెంగుళూరులో జరుగుతున్న టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ హాకీ మెన్ జట్టుపై తెలంగాణ యూనివర్సిటీ హాకీ మెన్ జట్టు 50 స్కోర్‌తో భారీ విజయం సాధించినట్టు వర్సిటీ క్రీడా విభాగం ఇన్‌చార్జి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ మహ్మద్ …
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన పిజి పరీక్షలు
డిచ్‌పల్లి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల పిజి మొదటి సంవత్సర రెండవ సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పరీక్షగా కేంద్రాలను విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ, కాన్ఫిడెన్సియల్ అధికారి సాయిలు, విశ్వవిద్యాలయ కళాశాల ప్రధానాచార్యులు సహాయ ఆచార్య నాగరాజు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయగౌడ్ తదితరులు పరీక్షించారు. ఉదయం జరిగిన పరీక్షలో మొత్తం విద్యార్థులు …
Read More »అరెస్టులు చేయడం పిరికిపంద చర్య
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గజ్వెల్ నియోజక వర్గం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేయడం పనికిమాలిన చర్య, పిరికిపంద చర్య అని మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఎర్రవెల్లి కేసీఆర్ …
Read More »అభివృద్ది పనులు ప్రారంభించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ 50 లక్షల రూపాయలతో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో కొత్తగా నిర్మిచిన పంచాయతీ భవనం, పల్లె పకృతి వనం, సిసి రోడ్లు, వైకుంఠ ధామంను ఎంపీపీ ఆంజనేయులు, సర్పంచ్, జెడ్పీటీసీలతో కలిసి ప్రారంభించారు.
Read More »కలెక్టర్‌ను కలిసిన కొత్త సిపి
నిజామాబాద్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ కమిషనరేట్ కొత్త పోలీస్ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన సిపి కె.ఆర్. నాగరాజు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని కలిశారు. సోమవారం కలెక్టర్ చాంబర్‌లో ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం కలెక్టర్ కూడా సి. పి. కి పుష్ప గుచ్చం అందించి జిల్లాకు ఆహ్వానించారు.
Read More »