కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 42 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని కోరారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని …
Read More »Yearly Archives: 2021
ధాన్యం సేకరణలో రైతులకు అండగా ప్రభుత్వం
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎఫ్‌సిఐ నిర్దేశించిన దానిని మించి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజల తరఫున యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో ధాన్యం సేకరణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకుని అవసరమైన ఇన్ఫ్రస్ట్రక్చర్ సమకూర్చుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల …
Read More »భరతజాతి ఆచార్యుడు వాల్మీకి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశ కుటుంబ వ్యవస్థ బలం రామాయణం అని, ఆ రామాయణాన్ని అందించిన వాల్మీకి భారత జాతికే ఆచార్యుడని హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. బుధవారం కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన వాల్మీకి జయంతి ఉత్సవంలో ఆయన మాట్లాడారు. రామాయణ కావ్యం ద్వారా లక్షల సంవత్సరాలు అయినా కరిగిపోని మానవ సంబంధాల రహస్యాలను వాల్మీకి ప్రపంచానికి …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్లారెడ్డి మండల కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి 51 మంది లబ్ధిదారులకు రూ.51,05,916 విలువ గల చెక్కులతో పాటు లబ్ధిదారులు ప్రతిఒక్కరికి చీరను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ …
Read More »కోవిడు నిబంధనలతో ఇంటర్ పరీక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నిబంధనలతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయవచ్చని అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షల నిర్వహణ నిమిత్తం సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారుల సమావేశం బుధవారం న్యూ అంబేద్కర్ భవన్‌లో …
Read More »న్యాయవాదుల సహకారంతోనే సత్వర పరిష్కారాలు
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవాదుల సహకారంతోనే సత్వర కేసుల పరిష్కారం జరుగుతుందని, బార్ బెంచ్ సంబంధాలు పటిష్టంగా ఉంటేనే, అందరికీ సమన్యాయం జరుగుతుందని కామారెడ్డి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ పేర్కొన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతికి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం బుధవారం బార్ అసోసియేషన్ హాల్‌లో …
Read More »ఘనంగా వాల్మీకి జయంతి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో ఆయన జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ …
Read More »రూరల్ ఇన్నోవేషన్ హబ్ భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్
డిచ్‌పల్లి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ శివారులో కాకతీయ సాండ్ బాక్స్ వారు ఏర్పాటుచేసిన రూరల్ ఇన్నోవేషన్ హబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయ సాండ్ బాక్స్ నుండి చాలా ప్రాజెక్టులు చేయడం వ్యవసాయం, స్కిల్ డెవలప్‌మెంట్, విద్య అందులోనూ రూరల్ ఏరియాలో బాగా ఉపయోగపడే అవకాశం …
Read More »వరికోత మిషన్ పరిశీలించిన జాయింట్ కలెక్టర్
ఆర్మూర్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో వరి ధాన్యం కొనుగోళ్ళు వరి కోత కట్టింగ్ హార్వెస్టింగ్ మిషన్‌ను జాయింట్ కలెక్టర్ చంద్ర శేఖర్, డిసివో సింహాచలం, డిఎం సివిల్ సప్లయ్ అబిషేక్, పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం బొజరెడ్డి, ఏడిఏ హరికృష్ణ, తహసిల్దార్ వేణు గోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లడుతూ వరి …
Read More »రక్తదాన శిబిరం విజయవంతం
కామారెడ్డి, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి కేంద్రంలో మంగళవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సెక్రటరీ రాజన్న పేర్కొన్నారు. ఎల్లారెడ్డి కేంద్రంలో ముస్లిం యువకులు మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన మాజీ జడ్పిటిసి గయాజోద్ధిన్, …
Read More »