Yearly Archives: 2021

గ్యారెంటీ ఉన్న వస్తువులు కొనుగోలు చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారులు గ్యారెంటీ, వారంటీ ఉన్న వస్తువులను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. వినియోగదారుడు వస్తువులు తీసుకున్న తర్వాత బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. …

Read More »

పేద విద్యార్థినికి హెల్పింగ్‌ హార్ట్స్‌ చేయూత

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా రెవెన్యూ ఉద్యోగులు హెల్పింగ్‌ హార్ట్స్‌ ఫౌండేషన్‌గా ఏర్పడి వారి జీతములోనుండి నెల నెలా డబ్బులు జమచేస్తు పేద విద్యార్థులను ఎంబిబిఎస్‌ చదివిస్తున్న సంగతి తెలిసినదే. పేద విద్యార్థిని అయిన వంచ సౌమ్య, తండ్రి విద్యాసాగర్‌ నిజామాబాద్‌కు చెందిన విద్యార్థినిని గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్‌ ఉస్మానియాలో ఎంబిబిఎస్‌ చదువుతూ, ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. విద్యార్థి తండ్రికి …

Read More »

కలెక్టర్‌కు శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డికి అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, చిత్రా మిశ్రా, కలెక్టరేట్‌ ఉద్యోగులు, జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమణ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులు, టీఎన్జీవోస్‌ …

Read More »

వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్‌ యుగం నడుస్తుండటంతో వినియోగదారుడు …

Read More »

మాస్క్‌ అక్కడ.. మరి నెంబర్‌ఎక్కడ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోనా, ఓమ్రికాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్‌ ధరించడం ఎంతో ఆవశ్యకమైంది. కానీ కొందరు తుంటరి యువత మాత్రం మాస్క్‌ ఏకంగా తమ దిచక్రవాహన నెంబర్‌ ప్లేట్‌లకు పెట్టుకొని హల్చల్‌ చేస్తున్నారు. నిజామాబాదు జిల్లా కేంద్రంలో బస్టాండ్‌ సమీపంలో ఓ యువకుడు తన దిచక్రవాహనానికి ఇలా మాస్క్‌ వేసి ప్రయాణిస్తున్న చిత్రం కనిపించింది.

Read More »

ఆపన్నులకు అండగా నిలవాలి…

నిజామాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ అధ్యక్షులు, జిల్లా పాలనాధికారి సి నారాయణ రెడ్డిని జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా తన కార్యాలయంలో కలిశారు. నూతనంగా ఎన్నికైన జిల్లా చైర్మన్‌ బుస్సా ఆంజనేయులు తన కార్యవర్గాన్ని పాలనాధికారికి పరిచయం చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరింత రెట్టింపు …

Read More »

పోషక విలువలతో కూడిన వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలి

మాక్లూర్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రసాయన ఎరువులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు ఆలోచించాలని తద్వారా ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సూచించారు. మాక్లూర్‌ మండలం రాజు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ రైతు చిన్ని కృష్ణుడు నిర్వహించనున్న దేశి వరి విత్తన బ్యాంకు ప్రారంభోత్సవాన్ని కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. డిసెంబర్‌ 23 జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన …

Read More »

రఘుపతికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగపు పరిశోధకులు దాసమ్‌ రఘుపతికి పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. కె. అపర్ణ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి దాసమ్‌ రఘుపతి ది ఫర్ఫామెన్స్‌ ఆఫ్‌ సెక్టోరల్‌ ఇండిసెస్‌ ఎట్‌ బియస్‌సి అండ్‌ యన్‌యస్‌సి అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత …

Read More »

అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నందున చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. చలిగాలులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Read More »

సోలార్‌ ప్రయోజనాలను మహిళలకు వివరించాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోలార్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐకేపీ ద్వారా గ్రామాల్లో సర్వే చేపట్టి సోలార్‌ యూనిట్లు కావలసిన మహిళల పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. టీఎస్‌ రెడ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »