Yearly Archives: 2021

మునిసిపల్‌ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలి

బోధన్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపాలిటీలో అన్నీ కేటగిరీలలో పని చేస్తున్న కాంట్రాక్టు/అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులకు జీవో నెం 60 లో పేర్కొన్న ప్రకారం వారి వేతనాలను పెంచి, జూన్‌ నెల నుండి కొత్త వేతనాలను అమలు చేసి, బకాయిలతో సహా చెల్లించాలంటూ మున్సిపల్‌ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేసి …

Read More »

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్‌నూర్‌ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండలం రామ్‌ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్యకు తెలియజేయగానే ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …

Read More »

వేల్పూర్‌ గ్రామ అభివృద్ధి కమిటీ ఎన్నిక

వేల్పూర్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ సమావేశ మందిరంలో వేల్పూర్‌ గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మోహన్‌ దాస్‌ ఎన్నికైనట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. తమను నమ్మి గ్రామ అభివృద్ధి కమిటీ …

Read More »

వేతన పెంపు జివో 60 వెంటనే అమలు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంపు వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల …

Read More »

మంచినీరు పేరుతో మురికి నీరు అందించడం సిగ్గుచేటు

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో వచ్చే గోదావరి జలాలు మురికి నీరు కంటే అధ్వానంగా రావడం జరుగుతుందని, ఈ నీళ్లు తాగితే ప్రజలకు భయంకరమైన రోగాలు వస్తాయని కామారెడ్డి జిల్లా బిజెపి మీడియా అనుబంధాల కన్వీనర్‌ విశ్వనాధుల మహేష్‌ గుప్తా అన్నారు. మున్సిపల్‌ అధికారులు మంచినీరు సరఫరా చేయాల్సింది పోయి మురికి నీరు సరఫరా చేయడం సిగ్గుచేటని ప్రజల నుండి …

Read More »

దోమలు ఉత్పత్తి కాకుండా ఆయిల్‌ బాల్స్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్‌ వారి ఆధ్వర్యములో ఆర్మూర్‌ పట్టణములోని జిరాయత్‌ నగర్‌, సంతోష్‌ నగర్‌, సిక్కుల కాలనీలలో రోడ్డుకు ఇరువైపుల వున్న డ్రైనేజీలలో, మురికి గుంటలలో దోమలను వాటి గుడ్లను (లార్వా) లను అంతం చేయడానికి ప్రాచీన పద్దతిలో ఆయిల్‌ బాల్స్‌ వేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్‌ ఖాందేష్‌, ప్రధాన …

Read More »

పోడుభూముల సమస్యపై నిరంతర పోరాటం

గాంధారి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ప్రధాన సమస్య అయిన పోడుభూములపై పోరాటం నిరంతరాయంగా కొనసాగుతుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి అన్నారు. అఖిలపక్షం, టీపీసీసీ పిలుపుమేరకు మంగళవారం గాంధారి మండల కేంద్రంలో నెహ్రు చౌరస్తా వద్ద పోడుభూముల సమస్యలపై ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ దళిత గిరిజనుల సమస్యల పరిస్కారం కొరకు కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

మత్స్యకారులకు చేపపిల్లల పంపిణీ

గాంధారి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కులవృత్తుల ఉపాధిలో భాగంగా మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నట్లు గాంధారి ఎంపీపీ రాధా బలరాం నాయక్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం వద్ద మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపపిల్లలను బెస్త, ముదిరాజ్‌లకు అందజేశారు. మండలం కేంద్రంతో పాటు గండివేట్‌, పొతంగల్‌, ముదెల్లి, సితాయిపల్లి, గౌరారం గ్రామాలలో గల చెరువులలో వదలడానికి 11 లక్షల 74 …

Read More »

గురుకుల పాఠశాలలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం

వేల్పూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నిజామాబాద్‌ జిల్లాలో గురుకుల పాఠశాలలకు ఎంపికైన 15 విద్యార్థులకు శాలువా మెమొంటోతో పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు విజయ్‌ కుమార్‌, జమాలుద్దీన్‌ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రుల తర్వాత మొదటి గురువు ఉపాధ్యాయులని తెలిపారు. గత పది సంవత్సరాల నుండి గురుకుల పాఠశాలలకు 150 విద్యార్థినీ …

Read More »

మెడికల్‌ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్ళాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెడికల్‌ ఆఫీసర్లు రోజు ఫీల్డ్‌లో వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌ సమావేశం మందిరంలో సీజనల్‌ వ్యాధులు, వ్యాక్సినేషన్‌పై వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మెడికల్‌ ఆఫీసర్‌ రోజు కనీసం గంట సేపైనా ఫీల్డ్‌లో వెళ్లాలని అన్నారు. పదిహేను రోజులు గట్టిగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »