వేల్పూర్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం బాల్కొండ నియోజకవర్గ మంత్రి సూచన మేరకు వేల్పూరు మండల గ్రామ టిఆర్‌ఎస్ పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు గురువారం ప్రకటించారు. మండల సమన్వయ సభ్యులు మాట్లాడుతూ వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాల నూతన టిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. వేల్పూర్ మండల గ్రామ …
Read More »Yearly Archives: 2021
ఫణిహారం రంగాచారికి ఘన నివాళి…
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్బంగా గురువారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఫనిహారం రంగాచారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ భూమి కోసం విముక్తి కోసం 4 వేల మంది కమ్యూనిస్టు …
Read More »వేల్పూర్‌లో 10 సెంటర్లలో వ్యాక్సినేషన్
వేల్పూర్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా మండలంలో 10 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని 10 ఆరోగ్య ఉప కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, మండల ప్రజలు పూర్తి స్థాయిలో …
Read More »స్థానికులకే ఉద్యోగాలలో అవకాశం ఇవ్వాలి
డిచ్‌పల్లి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత నెల రోజులుగా ఔట్ సోర్సింగ్ ప్రతిపాధికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, వేరే జిల్లా వారిచే భర్తీ చేయకూడదని వైస్ ఛాన్స్‌లర్ రవీందర్‌కి టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కుక్, స్వీపర్, అటెండర్, సెక్యురిటి …
Read More »ప్రత్యేక డ్రైవ్‌లో 18 సంవత్సరాలు దాటిన అందరికి వ్యాక్సిన్
నిజామాబాద్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నుండి ప్రత్యేక డ్రైవ్‌తో 18 సంవత్సరాలు నిండిన వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం అర్హులు అందరూ కవర్ అయ్యే విధంగా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం జారీ చేసిన ఏ బి …
Read More »సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే
బోధన్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో బీజేపీ పార్టీ చెపుతున్నట్లు సెప్టెంబర్-17 విమోచననో లేదా ఇతర పార్టీలు చెబుతున్నట్లు విలీనమో కాదని ముమ్మాటికీ విద్రోహ దినమేనని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు నైజాం పాలనలో నైజాం నిరంకుశత్వానికి …
Read More »నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం
జగిత్యాల, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకమని, సింగరేణి వారి సహకారంతో మెటుపల్లి పట్టణంలో 15 లక్షల విలువగల 32 సిసి కెమెరాలు ప్రారంభించడం జరిగిందని జిల్లా ఎస్పీ సింధు శర్మ సింగరేణి సి.ఎం.డి శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత రోజుల్లో నేరాలను నియంత్రణతో పాటు నేరస్థులను గుర్తించడంలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. …
Read More »22న మాచారెడ్డిలో సభ
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్ న్యాయకత్వంలో పని …
Read More »20న ధర్నా
నిజామాబాద్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు కోడ్ ల రద్దుకై ఐఎఫ్‌టియు జాతీయ కమిటీ పిలుపుమేరకు ఈనెల 20న కార్మిక శాఖ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యూ) రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ అన్నారు. ఈ మేరకు గురువారం కోటగల్లిలో ఎన్‌ఆర్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలోని …
Read More »వేల్పూర్ తహసీల్దార్‌కు బిజెపి వినతి
వేల్పూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని వేల్పూరు మండల తహశీల్దార్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు మల్కన్న గారి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనుండి తెలంగాణ విమోచన జరిగిందని తెలిపారు. నిజాం …
Read More »