గాంధారి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల సర్వ సభ్య సమావేశంలో బినామీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు అవకాశం కల్పిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీపీ రాధా బలరాం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా సమావేశానికి ముఖ్య అథితిగా ఎమ్మెల్యే సురేందర్ హాజరైయ్యారు. సమావేశానికి మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు హాజరైయ్యారు. అందులో కొంతమంది …
Read More »Daily Archives: January 3, 2022
అభివృద్ధిలో తెలంగాణ ఫస్ట్
గాంధారి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ …
Read More »సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది అని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్‌లో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మానవ హక్కుల కోసం పోరాడిన మానవతా వాదిగా, సావిత్రిబాయి పూలేను కొనియాడారు. అన్ని …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక..
డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని ఇటీవల విడుదల అయిన యుజి 3వ, 4వ రెగులర్ థియరీ పరీక్షలకు సంబందించిన రివ్యాల్యూషన్, రీకౌంటింగ్ సంబందించిన అప్లికేషన్లను విద్యార్థులు వారి కళాశాలలో ఈనెల 10వ తేదీలోపు అందజేయాలని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్‌ను, పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు.
Read More »ఏడవ తేదీ కల్లా వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
నిజామాబాద్, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోజుకు 30 వేల చొప్పున జనవరి 7 కల్లా 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాక్సినేషన్ నూటికి నూరు శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వైద్య ఆరోగ్య శాఖ, ఆర్‌డివోలు, సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో …
Read More »సావిత్రిబాయి పూలె విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి
డిచ్‌పల్లి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.సి. సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బి.సి. సెల్ డైరెక్టర్ డా. బి. సాయిలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ. నాగరాజు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ప్రసంగిస్తూ సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు …
Read More »