కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అంగన్వాడి కేంద్రంలో బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ కార్యకర్తకు సూచించారు.
ప్రాథమిక పాఠశాలలో వంటశాలగది శిథిలావస్థలో ఉన్నందున మరమ్మతులు చేయించాలని ఎంపిడిఓ బాలకిషన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల పిల్లలు చదువుతున్నారని గ్రామస్తులు చెప్పడంతో ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ విట్టల్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.