నిజామాబాద్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే 191వ జయంతి వేడుకలు నిర్వహించారు. కేవలం బడుగు బలహీన వర్గాల వారికే కాకుండా అగ్ర వర్ణాల నిరుపేదలకు కూడ తాను స్థాపించిన పాఠశాలలో 150 సంవత్సరాల క్రిందటే చదువు నేర్పిన గొప్ప దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే అని నాయకులు పేర్కొన్నారు.
తమ జీవిత కాలంలో దాదాపు 52 పాఠశాలలు స్థాపించి సామాజ అభ్యున్నతి కొరకు పని చేసిన నిస్వార్థ నారీ శిరోమణి సావిత్రి బాయి పూలే అని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు.
కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, నగర అధ్యక్షులు ధర్శనం దేవేందర్, యువజన అధ్యక్షులు కొయ్యాడ శంకర్, నాని, సంజీవ్, బాలన్న, లక్ష్మీనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.