గాంధారి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్ అవలంబిస్తున్న పథకాలతోనే సాధ్యం అయిందని అన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఆడపడుచుకు పెండ్లి సందర్బంగా కష్టం కావద్దని లక్ష నూట పదహారు రూపాయలు అందజేస్తున్న ఒకే ఒక్కరూ కెసిఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకం లేదని అన్నారు. మండలంలో 149 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తన స్వంత డబ్బులతో చీర కల్గిన కిట్టును ఎమ్మెల్యే అందజేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంటలు వేసే సమయానికి ముందుగానే రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుంతుందని అన్నారు. యాసంగికి సంబంధించి ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్‌లలో బదిలీ చేయడం జరిగిందన్నారు.
రైతులకు రైతు బీమా అమలు చేస్తున్న ప్రభుత్వం కేవలం కెసిఆర్ ప్రభుత్వమని అన్నారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలు రద్దు కోరుతూ ఆందోళన చేస్తూ మరణించిన 750 రైతు కుటుంబాలకు కెసిఆర్ 3 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ లోని అన్ని గ్రామాలలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో ఉందని అన్నారు.
గ్రామ గ్రామాన వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నామని, పల్లె ప్రక ృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతకుముందు రైతు బంధు విడుదల చేసిన సందర్బంగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్, సర్పంచ్ సంజీవ్ యాదవ్ తెరాస నాయకులు భజన్ లాల్, సాయికుమార్, సర్వపూర్ సత్యం పటేల్, ముకుంద్ రావు, శివాజీ రావు, తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీఓ సతీష్, అధికారులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.