నిజామాబాద్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సబ్సిడీ కింద అందిస్తున్న రైతుబంధు పై విజయోత్సవ కార్యక్రమాలు ఈ నెల 10 వరకు నిర్వహించాలని, జిల్లాలో మార్చి చివరి నాటికి దళిత బంధు కార్యక్రమంలో 100 యూనిట్లు గ్రౌండిరగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పలు అంశాలపై సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారం రైతుబంధు విజయోత్సవాలు, దళిత బంధు, టీఎస్ ఐ.పాస్ తదితర అంశాలపై సమీక్షించారు. రైతులకు అందిస్తున్న రైతుబంధుపై రైతు వేదికల ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు వంతుల వారీగా రైతు వేదికల ద్వారా ఈ విజయోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా ఈనెల 10వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశించారు.
హరితహారంపై మాట్లాడుతూ సీఎం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్ తన పర్యటనలో న్యూ కలెక్టరేట్‌లో నాటిన మొక్కలు ఒక మాడల్‌గా బాగున్నాయని ప్రశంసించారని ఇకముందు కూడా ఇదే విధంగా చేయాలని ఆదేశించారు. అధికారులు ఎక్కడికి వెళ్ళినా హరితహారంపై పర్యవేక్షణకు సమయం కేటాయించాలని అన్నారు. వారంలో రెండుసార్లు మొక్కలకు నీళ్లు పోయించాలని తెలిపారు. వచ్చే సీజన్‌లో హరితహారం రెండు సంవత్సరాలకు ప్లాన్ ప్రిపేర్ చేసి శుక్రవారం వరకు పంపాలన్నారు. ఖాళీ స్థలాలలో మీడియం వాకింగ్‌కు ప్లాంటేషన్ కొరకు గుర్తించాలన్నారు.
దళిత బంధులో జిల్లా మోడల్‌గా నిలవాలని దళిత సోదరులకు వందకు వందశాతం మేలు జరగాలన్నారు. ప్రతి యూనిట్ సక్సెస్ అవ్వాలని కమిట్‌మెంట్‌తో యూనిట్స్ గ్రౌండ్ చేయించే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళిత బంధు ద్వారా ఇస్తుందని 100 శాతం ఆ కుటుంబం పేదరికం నుండి బయటికి రావాలని అన్నారు.
మార్చి 31 వరకు 100 యూనిట్లు గ్రౌండిరగ్ చేయబోతున్నామని ప్రతి ఆఫీసర్ డిపార్టుమెంట్ పరంగా శుక్రవారం వరకు యూనిట్ శాఖలవారీగా అర్హులను గుర్తించాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా, డిఎఫ్‌వో సునీల్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.