కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలో గడికోటలో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు శిక్షణలో తగిన మెళకువలు నేర్చుకోవాలని సూచించారు.
క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. క్రీడలు ఆడడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఆర్చరీలో ఉన్న నైపుణ్యాలను విద్యార్థులు నేర్చుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు శిక్షణకు రావడం అభినందనీయమని కొనియాడారు. సమావేశంలో సర్పంచ్ అంజలి, ఎంపీపీ సదానంద, జడ్పీటీసీ సభ్యుడు తిరుమల గౌడ్, గడికోట ట్రస్ట్ ప్రతినిధి బాబ్జి, మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్, సహకార సంఘం చైర్మన్ నాగరాజు రెడ్డి, శిక్షకులు పూర్ణిమ, అనిల్, ప్రతాప్ దాస్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.