ఆర్మూర్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై, రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుపై చట్టరీత్య కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి పోలీసు కార్యాలయానికి వెళ్లి ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సైదయ్యకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ కుమార్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి వి నర్సింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర మంత్రివర్యులు, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు విలేకర్ల సమావేశంలో ఇతర సభలలో, సమావేశాలలో మీడియా సాక్షిగా, ప్రత్యక్ష ప్రసారంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డిని రండ మంత్రి అని చెప్పడం, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ని బెదిరిస్తూ తన గురించి మాట్లాడిన, తన జోలికి వచ్చిన ఆరు ముక్కలు చేస్తాను అంటే చంపేస్తాను అని బెదిరించడం, అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ని బెదిరిస్తూ, అసభ్య పదజాలం ఉపయోగించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వకుండా, ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తూ వీరి అధికారిక, అనధికారిక పర్యటనలో సైతం విధులను భంగం కలిగేలా వీరిపై భౌతిక దాడులు జరిగేలా ఉసిగొలుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ఎస్‌హెచ్‌వోకు ఫిర్యాదు చేశారు.
కార్యక్రమంలో బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు ఆకుల రాజు, దుగ్గి విజయ్, దళిత మోర్చా నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం, బీజేవైఎం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్దాపూర్ రాజేష్, బిజెపి సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, బిజెపి ఆర్మూర్ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, బిజెపి వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.