వేల్పూర్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కుకునూరుపాఠశాలలో భారత్ సేవ సహకర సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎన్ 95 మాస్క్‌లను అందజేసినట్టు సంస్థ సభ్యులు భారత ఆహార సంస్థ డైరెక్టర్ రవీందర్ ర్యడా తెలిపారు.
ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ కరోనా, ఓమిక్రన్ విజృంభిస్తుండడంతో సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాస్కులు అందజేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుక్కునూరు పాఠశాలలో విద్యార్థులకు మాస్కులు ఉచితంగా అందజేసినట్టు తెలిపారు.
విద్యార్థులకు పలు జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు తప్పకుండా మాస్కులు ధరించాలని కుటుంబ సభ్యులతో ఇతర గ్రామాలకు వెళ్ళినట్లయితే తప్పకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ బొలిశెట్టి లింబాద్రి, విద్యా కమిటీ చైర్మన్ రాజన్న, ఉపాధ్యాయులు మహేందర్, మోహన్, గటడి శ్రీనివాస్, అశోక్, సునీల్ కుమార్, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.