ఆర్మూర్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ బెడ్స్ అవసరమైనప్పుడు నిజామాబాద్ వరకు వెళ్లే అవసరం లేకుండా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
మంగళవారం కమ్మర్‌పల్లి, భీమ్‌గల్ మండలాలలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆక్సిజన్ బెడ్స్ ప్రారంభించారు. చౌటుపల్లి, భీంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆక్సిజన్ బెడ్స్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్సిజన్ బెడ్స్ దొరకక ఏ ఒక్కరు చని పోవద్దనే ఉద్దేశంతో థర్డ్ వేవ్ వచ్చినా, ఒమిక్రన్ లాంటి వేరియంట్ వచ్చినా పేదవారికి ఆక్సిజన్ బెడ్లు కావలసి వస్తే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్‌కు పోవాల్సిన అవసరం లేదన్నారు. ఏమాత్రం ఇబ్బంది లేకుండా భీంగల్ ముచ్కూర్ పీహెచ్‌సిలలో ఆక్సిజన్ బెడ్స్ ట్రీట్మెంట్ చేసుకునే ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ రాక ముందు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్‌లో ఐసియూ బెడ్స్ లేకుండే అన్నారు. గత సంవత్సరము రెండుసార్లు వచ్చిన కోవిడు వ్యాధి నుంచి తెలుసుకున్న అనుభవాలు కోవీడు వచ్చినప్పుడు బాల్కొండ నియోజకవర్గంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్స్ లేక చాలా మంది పేద వారికి చికిత్స అందక ఇబ్బందుల పాలు అయినారని, ఆక్సిజన్ బెడ్స్ పిహెచ్‌సిలో లేనందున ఆక్సిజన్ బెడ్స్ దొరకక కొందరిని కోల్పోయిన సంగతి కూడా మనకు తెలుసును అన్నారు.
మిత్రుల సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్ బాట్లింగ్ యూనిట్ ఐసియు బెడ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. సహకారం చేసిన మిత్రులకు అందరి పక్షాన, తన పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఆర్‌డిఓ శ్రీనివాస్, డిఎంహెచ్‌వో సుదర్శనం, జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమ రాజ్, డాక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.