బాన్సువాడ, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా సోమేశ్వర్‌లో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు.
అనంతరం రైతులను ఉద్దేశించి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర్ గ్రామంలోని 439 మంది రైతులకు 8 విడతలలో ఇప్పటి వరకు రైతు బంధు ద్వారా రూ. 1,69,31,948 (ఒక్క కోటి అరవై తొమ్మిది లక్షల ముప్పై ఒక తొమ్మిది వందల నలబై ఎనిమిది రూపాయలు) రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు.
రైతు బీమా ద్వారా సోమేశ్వర్ గ్రామంలో మరణించిన 9 మంది రైతులకు ఒక్కొక్క రికి 5 లక్షల రూపాయల చొప్పున ఆయా కుటుంబాలకు మొత్తం రూ. 45 లక్షలను అందించడం జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, సోమేశ్వర్ సర్పంచ్ పద్మ మొగులయ్య, ఎంపీటీసీ రమణ, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, బాన్సువాడ ఏంఎసి చైర్మెన్ పాత బాలకృష్ణ, బాన్సువాడ సొసైటీ ఛైర్మెన్ కృష్ణ రెడ్డి, మండల నాయకులు గోపాల్ రెడ్డి, ఏజాజ్, బాబా, బాన్సువాడ కౌన్సిలర్లు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.