కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన వాసవి క్లబ్ సభ్యులు విశ్వనాధుల మహేష్ గుప్తాను వాసవి క్లబ్ జిల్లా వి 130 ఇన్చార్జిగా నియామకం చేసినట్లు వాసవి క్లబ్ గవర్నర్ వల్లపుశెట్టి శ్రీనివాస్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.
వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషిచేయాలని, నూతన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అవకాశం ఇచ్చినందుకు వాసవి క్లబ్ గవర్నర్‌కు, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ మాజీ అధ్యక్షుడు యాద నాగేశ్వర్ గుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వనాధుల మహేష్ గుప్తా మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించినందుకు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆశీస్సులతో ముందుకు వెళ్తానని, వాసవి క్లబ్‌ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సభ్యులందరూ సహకరించాలని కోరారు.