నవీపేట్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశవ్యాప్తంగా పిల్లలకు ఇచ్చే కొవాక్సీన్ ప్రకియ చురుకుగా సాగుతుంది. పలుచోట్ల ఆరోగ్యకేంద్రానికి సంబంధించిన ఏఎన్‌ఎం, ఆశవర్కర్స్ ప్రతేక్యంగా పాఠశాలకు వెళ్లి టీకాలు వేస్తున్నారు.
ఇప్పటి వరకు 140 మంది పిల్లలకి కొవాక్సీన్ టీకా వేసినట్టు తెలిపారు. తల్లిదండ్రులు కొవాక్సీన్ టీకాపై అపోహలు వీడాలని, 17 సంవంత్సరాల వయసు ఉన్న ప్రతిఒక్కరు వాక్సినేషన్ చేయించుకోవాలన్నారు. ఆరోగ్యకేంద్రంలో టీకా అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో అనురాధ మంజుల, ఆశ వర్కర్లు కవిత, మీనా సాయికుమారి, భావన తదితరులు పాల్గొన్నారు.