నిజామాబాద్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజులుగా స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారన్నారు.
అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తో పాటు కరోనాను ఎదుర్కొనేందుకు విద్యార్థులందరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం వాణి, ఆశలు అరుణ, హఫీజ పాల్గొన్నారు.