నిజామాబాద్, జనవరి 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 421 మంది ఎస్సి విద్యార్థులకు టెన్త్ క్లాస్ ఆల్ ఇన్ వన్ గైడ్ పుస్తకాలు అందజేసినట్లు జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి శశికళ ప్రకటనలో తెలిపారు. టెన్త్ విద్యార్థులకు వందరోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా బిట్స్‌తో తయారుచేసిన పుస్తకాలను విద్యార్థుల కోసం సేకరించి హాస్టల్ విద్యార్థులకు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు.
విద్యార్థులు గైడ్ లను పూర్తిగా సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు పొంది మెరుగైన ఫలితాలు సాధించాలని ఆమె తల్లిదండ్రులకు, విద్యార్థులకు సూచించారు.