అకౌంటెంట్ల బదిలీలు చేపట్టాలి

నిజామాబాద్‌, జనవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు బదిలీలు చేపట్టాలని, కొత్తగా ఎంపికైన అకౌంటెంట్లకు పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్‌-టీచింగ్‌, వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, డీఈవోకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న సిబ్బందికి గతంలో బదిలీలు చేశారని, కానీ అకౌంటెంట్‌లకు ఇంతవరకు బదిలీలు చేపట్టలేదన్నారు. వీరు అతితక్కువ వేతనాలకు దూర ప్రయాణాలు చేసి విధులు నిర్వహించాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా జిల్లాలోని 25 కేజీబీవీలు వుండగా, 14 కేజీబీవీల్లో అకౌంటెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

ఈ పోస్టుల భర్తీ కోసం రెండు సంవత్సరాల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చి, రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారన్నారు. కానీ ఇప్పటికీ వారికి పోస్టింగ్‌ ఇవ్వలేదన్నారు. దీంతో రెండు సంవత్సరాలుగా ఎంపికైన అభ్యర్థులు డిఈఓ కార్యాలయం చుట్టూ కాల్లరిగేలా తిరుగుతున్నారన్నారు. వీరు వేరే ఉద్యోగాల వైపు పోకుండా, పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తూ ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

వెంటనే అకౌంటెంట్ల బదిలీలు చేపట్టి, వెనువెంటనే కొత్తవారికి పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నిఖిత, ప్రియాంక, సువీణ, మోతీ, అనూష, హేమలత, శైలజా తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »