కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం గోదాము నిర్మాణం పనులను జనవరి 31 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న గోదాం పనులను గురువారం ఆయన పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ రవిశంకర్, డిఈ శ్రీనివాస్, ఏఈ రవితేజ, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి …
Read More »Daily Archives: January 6, 2022
హరితహారం మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిత హారంలో నాటిన మొక్కలను పూర్తిస్థాయిలో కాపాడడం ద్వారా వచ్చే సంవత్సరం అవెన్యూ ప్లాంటేషన్ అవసరం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్సు హాల్ నుండి హరితహారం, ఓమిక్రాన్, లేబర్ టర్న్ ఔట్‌పై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం …
Read More »ఆపరేషన్ నిమిత్తం వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ కి చెందిన రామవ్వ (65) కు ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం నిజామాబాద్, ఆర్మూర్‌లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణానికి చెందిన కిరణ్ సహకారంతో ఓ నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న బి.ఎడ్. సెమిస్టర్ పరీక్షలు
డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి డా. ఎం. అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు మొత్తం 1259 మంది విద్యార్థులు నమోదు కాగా 1217 మంది హాజరు, 42 మంది గైర్హాజరు అయ్యారని ఆమె తెలిపారు. ఏ పరీక్షా …
Read More »అర్థశాస్త్రంలో ఆకుల శీనివాస్‌కు డాక్టరేట్
డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థి ఆకుల శ్రీనివాస్‌కు పిహెచ్.డి. డాక్టరేట్ అవార్డు ప్రకటించారు. అందుకు సంబంధించిన పిహెచ్.డి. వైవా వోస్ (మౌఖిక పరీక్ష) గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సెమినార్ హాల్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ కూలీల సమస్యలు, సమర్ధవంతమైన పరిష్కారాలు అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయం, అర్థశాస్త్ర విభాగ …
Read More »తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతిగా డా. కె. లావణ్య
డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతిగా అసోసియేట్ ప్రొఫెసర్ డా. కె. లావణ్య నియమింపబడ్డారు. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా ఆమె అందుకున్నారు. ఆమె 2007 జనవరిలో తెలుగు అధ్యయనశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో నియమింపబడ్డారు. ఇక విభాగాధిపతిగా వచ్చే రెండు సంవత్సరాలు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో …
Read More »పీఆర్‌ఓగా డా. త్రివేణి
డిచ్‌పల్లి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వి. త్రివేణి నియమితులయ్యారు. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా డా. వి. త్రివేణి అందుకున్నారు. డా. వి. త్రివేణి ఇది వరకు పీఆర్‌ఓగా మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు ఉన్నారు. అదే విధంగా టీయూ కల్చరల్ …
Read More »రైతుకు ఆర్థిక భరోసా రైతు బంధు పథకం
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుకు పెట్టుబడి సబ్సిడీ కింద అందించే రైతు బంధు పథకం రైతులకు ఆర్థిక భరోసాగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు సంబరాలలో భాగంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన రైతు బందు సంబరాలు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబంధు ద్వారా వానాకాలం యాసంగి …
Read More »రేపటికల్లా పిల్లలందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావాలి
నిజామాబాద్, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపటికల్లా 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య, విద్య శాఖ అధికారులు, ఆర్‌డివోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి సంబంధిత అధికారులతో వ్యాక్సినేషన్‌పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒమిక్రాన్ వేరియంట్ పిల్లలపైన ప్రభావాన్ని చూపుతుందని అందువల్ల 15 …
Read More »