కామారెడ్డి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ కి చెందిన రామవ్వ (65) కు ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం నిజామాబాద్, ఆర్మూర్లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు.
వెంటనే స్పందించి పట్టణానికి చెందిన కిరణ్ సహకారంతో ఓ నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా 45 వ సారి రక్తదానం చేసిన కిరణ్కు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, అర్చన, నీల నాగరాజు, రాజు తదితరులున్నారు.