కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేవునిపల్లి శాఖలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహించిన దాసరి రమేష్ గత ఏడాది ఏప్రిల్ నెలలో కోవిడ్ సోకి మరణించడం వలన కారుణ్య నియామకంగా తన కుమారుడు అయిన ప్రదీప్ కుమార్‌కు అటెండర్‌గా, అదేవిధంగా కామారెడ్డి శాఖలో అటెండర్‌గా విధులు నిర్వహించిన రవీందర్ గత ఏడాది మే నెలలో కోవిడ్ సోకి మరణించడం వలన కారుణ్య నియామకంగా తన కుమారుడు అయిన దినేష్ కుమార్‌కి స్టాఫ్ అసిస్టెంట్‌గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నియామక ఉత్తర్వులు అందజేశారు.
మరణించిన కుటుంబ సభ్యులకు తనవంతుగా ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఇంధల్వాయి సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సిఇఓ గజానంద్ పాల్గొన్నారు.