డిచ్పల్లి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో గల ఎగ్జిక్యూటివ్ హాల్లో కొత్త సంవత్సర (2022) వేడుకలు నిర్వహించారు.
పరిపాలనా భవనం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులందరికి, వారి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని శుభాలు కలగాలని కోరుకున్నారు. సిబ్బంది అందరు నూతనోత్సాహంతో పని చేసి విశ్వవిద్యాలయ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడాలని తెలిపారు.
అదే సందర్భంగా వీసీకి పరిపాలనా భవనం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్ఓ డా. వి. త్రివేణి, ఏఓ ఖాదర్ మొహినుద్ధీన్, ఏఆర్ సాయా గౌడ్, ఏఇ వినోద్ కుమార్, సూపరింటెండెంట్లు భాస్కర్, జ్యోతి, ఎస్టేట్ ఆఫీసర్స్ అశోక్ వర్దన్ రెడ్డి, యాదగిరి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వివేక్ రాజ్, తదితర ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొనారు.