డిచ్‌పల్లి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలుర పాత, కొత్త వసతి గృహాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం ఉదయం సందర్శించారు.
సంక్రాంతి సెలవులకు ఈ నెల 8 నుంచి 16 వరకు హాస్టల్స్ మూసి వేస్తున్న సందర్భంలో వీసీ వెళ్లారు. హాస్టల్స్‌లో గదులను, ఇతర సదుపాయాలను పరిశీలించారు. హాస్టల్స్‌లో కొన్ని అవసరం ఉన్న వాటికి మరమత్తులు చేయించి, పేయింట్ వేయించాలని చీఫ్ వార్డెన్‌ను ఆదేశించారు. వాటర్ వైప్స్, కరెంట్ సరఫరా, వడ్రంగి పనులు, గోడలకు సిమెంట్ మరమ్మత్తులను సెలవుల్లో చేయాలని సూచించారు.
ఉపకులపతితో పాటు చీఫ్ వార్డెన్ డా. అబ్దుల్ ఖవి, అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ కుమార్, ఉదయ్, కేర్ టేకర్స్ చౌహాన్, ప్లంబర్ సుదర్శన్ తదితర విద్యార్థులు ఉన్నారు.