నిజాంసాగర్, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల బాగోగులు చూసిన ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు అన్నారు. నిజాంసాగర్ మండలంలోని మొహమ్మద్ నగర్ గ్రామంలోని రైతు వేదికలో రైతుబంధు ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని రాజు మాట్లాడారు.
రైతులకు రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే రైతు వేదికలు రైతులకు సభలు ఏర్పాటు చేసి వ్యవసాయంపై అవగాహన కల్పించడానికి నిర్మించడం జరిగిందన్నారు. గ్రామాలలో వైకుంఠధామం, రోడ్డుకు ఇరుపక్కల హరితహారం మొక్కలు నాటడం జరిగిందన్నారు.
రైతు మరణిస్తే 5 లక్షల రూపాయలు వారం రోజులలో ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు పండిరచిన పంట వడ్లను ఎండ పోయడానికి వడ్ల కల్లాలను ఇవ్వడం జరుగుతుందన్నారు.కామారెడ్డి జిల్లా జడ్పి చైర్ పర్సన్ ధపెదర్ శోభ, ఎంపీపీ పట్లోల జ్యోతి దుర్గరెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు సాధుల సత్యనారాయణ, సిడిసి ఛైర్మెన్ గంగారెడ్డి, సర్పంచ్ ధపెదర్ బాలమణి, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, సొసైటీ చైర్మన్‌లు వాజీద్, రాధా విఠల్ రెడ్డి, నరసింహారెడ్డి, సర్పంచ్‌లు చందర్, లక్ష్మీనారాయణ లక్ష్మారెడ్డి, నాయకులు రాంచందర్, మహేందర్, కాశయ్య, విజయ్ తదితరులు ఉన్నారు.