నిజామాబాద్, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, టియుఎఫ్ఐడిసి ఎం.డి. నరసింహ రెడ్డి నగరంలోని న్యూ కలెక్టరేట్ రోడ్డులో నిర్మిస్తున్న ఐటి హబ్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతి వివరాలను అధికారులు, కాంట్రాక్టర్లని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో నగరంలో ఐటి హబ్ నిర్మాణానికి ఐటి శాఖ మంత్రి వర్యులు కెటిఆర్‌తో భూమి పూజ చేయించడం జరిగిందన్నారు.
ఐటి హబ్ భవనం నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో ఇది వరకే ద్వితీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో ఐటి హబ్‌లు ఏర్పాటయ్యాయన్నారు. వాటికి ధీటుగా నిజామాబాద్ నగరంలో ఐటి హబ్ మరి కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసి యువతకి ఉపాధి కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమంలో అధికారులు, కాంట్రాక్లర్లు ఉన్నారు.