నిజామాబాద్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా అంతర్జాతీయ మానవ హక్కుల సమితి అధ్యక్షులుగా అబ్బ గోని అశోక్ గౌడ్కి తెలంగాణ అంతర్జాతీయ మానవ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు కుమార్ మహేంద్ర హైదరాబాదు ప్రధాన కార్యాలయంలో నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ మానవ హక్కుల కోసం ఎల్లవేళల కృషి చేస్తానని, సామాన్య ప్రజలకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని తెలిపారు. (ఐహెచ్ఆర్సి) ఇంటర్నేషనల్ హుమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున సామాన్య ప్రజలకు ఏ ఆపద సమయంలోనైనా ముందుంటానని పేర్కొన్నారు.
తనను గుర్తించి అవకాశం ఇచ్చిన అంతర్జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ మహేంద్రకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కురుమన్న, రాజు, రాజలింగం, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.