నిజామాబాద్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్థానిక ఈవీఎం గోదాం పరిశీలించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోదాంలను భవనాల కండిషన్‌పై పరిశీలించి నివేదిక అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన సంబంధిత అధికారులతో గోదాంను నిర్వహిస్తున్న మరమ్మతులను పరిశీలించారు.
స్లాబ్ లీకేజీ లేకుండా చూడాలని పనులు నాణ్యతతో నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఇపిఆర్ శంకర్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు వినోద్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.