కామారెడ్డి, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు తవ్విన కందకాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచుతున్న నర్సరీని సందర్శించారు.
నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో కూరగాయల నర్సరీని పరిశీలించారు. వంగ, టమాటా, మిరప నారు పెంచడం వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుందని రైతు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనంతరావు, ఎంపీవో ప్రవీణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.