బోధన్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామ్రేడ్ శావులం సాయిలన్న ఆశయాల సాధనకై పోరాడుదామని సి.పి.ఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు.
మంగళవారం బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద జరిగిన కామ్రేడ్ శావులం సాయన్న 26 వ వర్ధంతి సందర్భంగా బి.మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడ్ సాయిలన్న రైతు కూలీలు, కార్మికుల, మహిళల, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై అనేక ఆందోళన కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. అట్లాగే మల్లెపాడు శివారులోని భూములకై, నిజాంసాగర్ నీళ్లకై, నిజాంసాగర్ ఫ్యాక్టరీ భూములు ప్లాంటేషన్ కార్మికులకు ఇవ్వాలని జరిగిన పోరాటాల్లో ముందున్నారని కొనియాడారు.
ఆయనను 1996లో పీపుల్స్ వార్ అరాచకవాదులు పోలీస్ ఇన్ ఫార్మర్ అనే పేరుతో హత్య చేశారని దాన్ని ఇప్పటికీ నిరూపించలేక పోయారని తీవ్రంగా ఖండిరచారు. కామ్రేడ్ శావులం సాయన్న ఆశయాలకై పోరాటాలు చేయడమే ఆయనకు నిజమైన నివాళులర్పించినట్లని తెలిపారు.
కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు పడాల శంకర్, జి. సీతారాం, ఎస్.బాలయ్య, బి. సాయిలు, పోశెట్టి, ఎస్. శంకర్, సాయిలు, సుల్తాన్, బుజ్జి, రమేష్, తదితరులు పాల్గొన్నారు. మొదట కామ్రేడ్ శావులం సాయిలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.