కామారెడ్డి, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్ వాడి కేంద్రాలలో బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించే విధంగా ఐసిడిఎస్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్సు హాల్‌లో మంగళవారం ఐసిడిఎస్, వైద్యశాఖ, ఐకెపి అధికారులతో బలహీనమైన పిల్లలను గుర్తించాలని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లల బరువును, ఎత్తులు కొలువాలని సూచించారు. అంగన్‌వాడి, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అదేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల వారిగా బలహీనమైన పిల్లలను గుర్తించాలని పేర్కొన్నారు. గ్రామ సమాఖ్యలలో మహిళా ఆరోగ్య సమితి ఆధ్వర్యంలో బలహీనంగా ఉన్న పిల్లలపై చర్చించాలని కోరారు.
ఆర్‌బిఎస్‌కె టీం గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలలో వైద్య పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా వైద్య అధికారిని కల్పన కంటే, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, ఆయుష్ వైద్యుడు వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి, సిడిపివో లు, ఐకెపి డిపీఎంలు, అధికారులు పాల్గొన్నారు.