ఆర్మూర్, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద జయంతి సందర్భంగా స్థానిక మండల వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం 2022 సంవత్సరం క్యాలెండర్ను ఆర్మూర్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు రామ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ బాధ్యులు తిరునగరి దయాసాగర్, రుద్ర మధుసూదన్, రాంప్రభు, టీవీ రవికాంత్, రంజిత్, గంగారెడ్డి, స్థానిక ఉద్యోగులు పాల్గొన్నారు.