కామారెడ్డి, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్య పనులను చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని స్మశాన వాటిక లను, డంపింగ్ యార్డ్ లను వినియోగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రావని పేర్కొన్నారు. పల్లె ప్రకృతి వనాల నిర్వహణ సజావుగా జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డిఎల్‌పివోలు సాయిబాబా, శ్రీనివాస్, రాజేంద్ర కుమార్, ఎంపీవోలు పాల్గొన్నారు.