ఆర్మూర్, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్ అధ్యక్షులు వడ్డీ ప్రశాంత్, కార్యదర్శి విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వడ్డే ప్రశాంత్ మాట్లాడుతూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు నిర్వహించామని, భారత దేశ యువత స్వామి వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమాజ్ అధ్యక్షులు పడాల్ గణేష్, ఉపాధ్యక్షులు కర్తన్ దినేష్, యువజన సమాఖ్య ఉపాధ్యక్షులు దోండి అనిల్ కుమార్, సాయి, విశాల్, సురేష్ వర్మ, జీకే మణిదీప్, యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.