Breaking News

Daily Archives: January 13, 2022

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు…

నిజామాబాద్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ పెంచే బాధ్యత అటవీ శాఖ అధికారులదేనని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. గురువారం ఎడపల్లి మండలం జాన్కంపెట్‌, ఎడపల్లి గ్రామాలలో రహదారికి ఇరువైపులా పెంచుతున్న అవెన్యూ ప్లాంటేషన్‌ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో భాగంగా జిల్లాలో ఎడపల్లి మండలం జాన్కంపెట్‌, ఎడపల్లి గ్రామాలలో రోడ్లకు ఇరువైపుల అవెన్యూ ప్లాంటేషన్‌లో …

Read More »

సైబర్‌ క్రైమ్‌ జరిగిన వెంటనే 155260 నెంబర్‌కు కాల్‌చేయాలి…

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బిక్కనూర్‌ వాస్తవ్యుడు గడ్డం మల్లేష్‌ సైబర్‌ నేరాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు. కామారెడ్డి జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఎంపీడీవో, ఏపీవోల సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. కొత్తగా సైబర్‌ నేరాలు జరుగుతున్న తీరును, తీసుకోవలసిన జాగ్రత్తలను …

Read More »

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు తెలంగాణ క్యాలెండర్‌, డైరీని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, డిఆర్‌డిఓ వెంకట మాధవ రావు, పిఆర్‌టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అంబీర్‌ మనోహర్‌ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, రాష్ట్ర , జిల్లా బాధ్యులు ఆనంద్‌, యేసు రత్నం, …

Read More »

ఉత్తర ద్వార దర్శనమిచ్చిన లింబాద్రి నృసింహుడు

భీమ్‌గల్‌, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణ కేంద్రంలో గ్రామాలయంలో, లింబాద్రి గుట్ట పైన స్వామి వారు గురువారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారము ద్వారా భక్తులకి దర్శనం ఇచ్చారు. ఉదయం నుండే భక్తులు వరుస కట్టి కరోన నిబంధనలు పాటిస్తూ మాస్క్‌ ధరించి దర్శనాలు చేసుకున్నారు. అనంతరం భక్తులకి దేవస్థానం అర్చకులు వంశ పరంపర్యులు నంబి లింబాద్రి, పార్థ సారథి ఆద్వర్యంలో …

Read More »

14న సూర్యనమస్కార వేడుకలు

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర భారత అమృత మహోత్సవాల్లో భాగంగా జాతీయ యువజన వారోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న సెమినార్‌లో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా నుంచి ఎంపిక చేయబడిన యువతీయువకులు పాల్గొన్నారు. 14వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సూర్యనమస్కార వేడుకలో జిల్లా యువతీ యువకులు తమ తమ ఇళ్లల్లో సాధన చేస్తూ ఫోటోలు, వీడియోలు తమకు పంపవలసిందిగా కోరుతున్నామని జిల్లా …

Read More »

కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యం వద్దు

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీ వోలతో ఉపాధి హామీ పనులపై జరిగిన సమీక్ష సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పాజిటివ్‌ వచ్చినవారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »