కామారెడ్డి, జనవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిఆర్టియు తెలంగాణ క్యాలెండర్, డైరీని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్డిఓ వెంకట మాధవ రావు, పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరాజం, రాష్ట్ర , జిల్లా బాధ్యులు ఆనంద్, యేసు రత్నం, సురేందర్, రమణ, శ్రీనివాస్, ఎల్లా గౌడ్, గణేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌కి మెమోరండం సమర్పించారు. 317 జీవో ద్వారా ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు పరస్పర బదిలీల అవకాశం కల్పించాలని, భార్యాభర్తలు ఒక జిల్లాలో పనిచేసే విధంగా చూడాలని, ప్రమోషన్స్, సాధారణ బదిలీలు చేపట్టాలని కోరారు.