ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, జనవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డికి చెందిన రాజుకు (35) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న బత్తిని రవికుమార్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఏ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు.

గతంలో కూడా అత్యవసర పరిస్థితుల్లో దోమకొండ నుంచి రక్త దానం చేయడం జరిగిందని, శుక్రవారం 8 వ సారి రక్తదానం చేయడం అభినందనీయమని, యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. టెక్నీషియన్లు చందన్‌, అర్చన, నాగరాజు పాల్గొన్నారు.

Check Also

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »