కామారెడ్డి, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
కోవిడ్ కేసులు అధికంగా పెరగడం, వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.