ఐసిఎస్‌ఐతో టీయూ కామర్స్‌ ఎం.ఒ.యు.

డిచ్‌పల్లి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ విభాగం, ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా మెమొరండం ఆఫ్‌ అండర్‌ స్టాండిరగ్‌ (ఎంఒయు) ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ విభాగాధిపతి డా. రాంబాబు గోపిసెట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐసిఎస్‌ఐ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎం.ఒ.యు. కుదుర్చుకున్నారు.

ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా సదరన ఇండియా రీజినల్‌ కౌన్సిల్‌ తన 13వ ప్రాంతీయ ప్రాక్టీసింగ్‌ కంపెనీ సెక్రటరీల కాంఫరెన్స్‌ను 15 జనవరి 2022న హోటల్‌ పార్క్‌, సోమాజిగూడ, హైదరాబాద్‌లో కంపెనీ సెక్రటరీల ప్రయోజనం కోసం నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయం సిఎస్‌ఐ ఇండియా ప్రెసిడెంట్‌ సిఎస్‌ నాగేంద్ర డి.రావు, ఐసిఎస్‌ఐ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ సిఎస్‌ నవజ్యోతి పుట్టపర్తి, తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, కామర్స్‌ విభాగాధిపతి డా. రాంబాబు గోపిసెట్టి ఎం.ఒ.యు. ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక వాణిజ్య వ్యాపార రంగాలలో ఖ్యాతి గడిరచడానికి అనువైన అవకాశాలను అందిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఇ. కామర్స్‌ విభాగంలో ఐసిఎస్‌ఐ ద్వారా విద్యా ప్రమాణాలు పెంపొందింప జేయడానికి ఈ ఒప్పందం అనుకూలంగా మారుతుందన్నారు.

డా. రాంబాబు గోపిసెట్టి విభాగాధిపతిగా ఇ. కామర్స్‌ విద్యార్థులకు, పరిశోధకులకు ఎనలేని సేవ చేస్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో వివిధ సంస్థల ద్వారా ఒపందాలను కుదుర్చుకున్న విషయాన్ని తెలిపారు. కంపెనీ సెక్రటరీస్‌ సహాయ సహకారాలతో తెలంగాణ విశ్వవిద్యాలయం అకడమిక్‌ పరంగా ఉన్నత స్థానంలో నిలుస్తుందని అన్నారు. గ్రామీణ స్థాయిలో కంపెనీ సెక్రటరీస్‌ తమ లక్ష్యాలను నెరవేర్చడానికి తెలంగాణ విశ్వవిద్యాలయం మంచి వేదికగా రూపొందుతుందని ఆయన అభిలషించారు.

డా. రాంబాబు గోపిసెట్టి మాట్లాడుతూ ఇ. కామర్స్‌ విభాగం ఇతర అకడమిక్‌ సంస్థలతో ఏర్పరుచుకున్న ఎం.ఒ.యు. లలో ఇది మూడవదని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఐసిఎస్‌ఐకు చెందిన ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు. సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ కామర్స్‌ విభాగ ఐసిఎస్‌ఐ సభ్యులతో చర్చిస్తారని పేర్కొన్నారు. క్యాపిటల్‌ మార్కెట్‌లో విద్యార్థులను భాగస్వామ్యం వహించే విధంగా ఈ ఒప్పందం సహకరిస్తుందన్నారు.

కార్పోరేటర్స్‌, షేర్‌ హోల్డర్స్‌ ప్రయోజాలను నెరవేర్చే దిశలో కంపెనీ సెక్రటరీస్‌ అనుసరిస్తున్న విధానాలను గూర్చి తెలిపారు. సెమినార్లు, కోర్సులకు చెందిన స్పాన్సరింగ్‌, ఉపకార వేతనాలు, ప్రతిభ కనబరిచిన స్టూడెంట్స్‌కు మెడల్స్‌ అందిస్తారని అన్నారు. కంపేనీ సెక్రటరీస్‌ పరీక్షలు నిర్వహించి ఆల్‌ ఇండియా ర్యాంకులను విడుదల చేసి అవార్డులను ప్రదానం చేసుందన్నారు.

ఈ ఒప్పందంతో జాతీయ స్థాయిలో కంపెనీ సెక్రటరీస్‌తో కామర్స్‌ విద్యార్థులకు, పరిశోధకులకు అనుబంధం ఏర్పడుతుందన్నారు. నాణ్యమైన విద్యా ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నూతనమైన అకడమిక్‌ ప్రణాళికను ఏర్పాటు చేస్తామని అన్నారు. నూతన విద్యావిధానానికి అనువైన పాఠ్య ప్రణాళికలను రూపొందించే విధంగా కంపెనీ సెక్రటరీల కార్యాచరణ రూపుదిద్దుకున్నదని ఆయన పేర్కొన్నారు. తదనంతరం సిఎస్‌ఐ ఇండియా ప్రెసిడెంట్‌ సిఎస్‌ నాగేంద్ర డి. రావు, ఐసిఎస్‌ఐ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మన్‌ సిఎస్‌ నవజ్యోతి పుట్టపర్తి తదితరులు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను ఘనంగా సన్మానించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »