Daily Archives: January 17, 2022

కాంగ్రెస్‌లో చేరిన భవానిపేట నాయకులు

మాచారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం మాచారెడ్డి మండలం భవాని పేట గ్రామానికి చెందిన పలువురు టిఆర్‌ఎస్‌, బిజెపికి చెందిన కార్యకర్తలు కామారెడ్డి నియోజకవర్గ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు మొహమ్మద్‌ నయీమ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరు టిఆర్‌ఎస్‌ పార్టీ వాగ్దానాలకే పరిమితం కానీ చేతలకు దూరంగా ఉంటున్నందున ఆ పార్టీ పైన విరక్తి చెంది, రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో, మన …

Read More »

హరితహారం, దళిత బంధు ప్రాధాన్యతాంశాలు

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మరో ఆరు నెలల పాటు ఈ రెండు కార్యక్రమాల పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి హరితహారం, దళిత బంధు …

Read More »

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పోటీలు

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌, షార్ట్‌ ఫిలిం పోటీలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆన్‌ లైన్‌ ద్వారా పోటీలు నిర్వహించే విధంగా …

Read More »

27న రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికలు

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27న మండల స్థాయిలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులకు సెల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సభ్యత్వం పొందిన ఏడాది తర్వాత ఎన్నికల్లో …

Read More »

ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయ ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని …

Read More »

ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌గా డా. రవీందర్‌ రెడ్డి

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గల జాతీయ సేవా పథకం (ఎన్‌ ఎస్‌ ఎస్‌) కో ఆర్డినేటర్‌గా అప్లైడ్‌ ఎకనామిక్స్‌ విభాగానికి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలంగాణ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు డా. కె. రవీందర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ నియామక ఉత్తర్వును జారీ …

Read More »

ఈనెల 31 వరకు వర్చువల్‌ విధానమే

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకు తీవ్రమవుతున్న కరోనా దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో జనవరి 31 వరకు వర్చువల్‌ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి తెలిపారు. ఈ మేరకు సోమవారం జరిగిన బార్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుని తీర్మానించినట్లు బిక్షపతి పేర్కొన్నారు. ఇట్టి సమాచారాన్ని న్యాయమూర్తులకు తెలియజేసినట్లు ఆయన …

Read More »

ఎం.ఎడ్‌. పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని సారంగపూర్‌ క్యాంపస్‌ కళాశాలకు చెందిన ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 27 నుంచి జరుగవలసి ఉండగా కోవిద్‌ – 19 నిబంధనలను అనుసరించి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం.అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తదనంతరం ప్రకటిస్తామని ఆమె అన్నారు. కావున ఈ …

Read More »

ప్రతి ఒక్కరూ కోవిడ్‌ టీకా వేసుకోవాలి

గాంధారి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వాక్సిన్‌ వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జీతేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకోవాలని సూచించారు. అదేవిదంగా …

Read More »

ఓపెన్‌ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »