మాచారెడ్డి, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం మాచారెడ్డి మండలం భవాని పేట గ్రామానికి చెందిన పలువురు టిఆర్‌ఎస్, బిజెపికి చెందిన కార్యకర్తలు కామారెడ్డి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నయీమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు టిఆర్‌ఎస్ పార్టీ వాగ్దానాలకే పరిమితం కానీ చేతలకు దూరంగా ఉంటున్నందున ఆ పార్టీ పైన విరక్తి చెంది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మన జిల్లాలో షబ్బీర్ అలీ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస రావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించి, నిత్యావసర వస్తువుల ధరలు గానీ, గ్యాసు పెట్రోల్ డీజిల్ ధరలు కానీ అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం కాక, వారికి నిరుద్యోగ భృతి కూడా కల్పించకపోవడం శోచనీయమన్నారు.
యువకులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని, షబ్బీర్ అలీ నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చిట్కాలు నర్సారెడ్డి, బొమ్ బోతుల రవి గౌడ్, గ్రామ అధ్యక్షుడు కుమ్మురి బాబు, పద్మారెడ్డి, పెద్దలో లింగం, చింతల నర్సింహులు, రాజు, హినాహేతుల గంగని లింగం, లక్క పతిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారు సమరసింహా రెడ్డి, సాగర్ గౌడ్, సాయి కుమార్, శ్రావణ్ రవికుమార్, గంగరాజు, దుర్గయ్య, గఫార్, కరీం, ఆంజనేయులు, లవ కుమార్, శేఖర్, శ్రీకాంత్‌తో పాటు దాదాపు 50 మంది వరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.