ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి

నిజామాబాద్‌, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయ ప్రగతిభవన్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండిరగ్‌లో ఉంచకుండా, అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జిల్లా అధికారులను ఆదేశించారు.

ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ అండర్‌ ట్రైనీ మకారంధ్‌, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »